Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్పోలీస్ స్టేషన్ కెక్కిన అక్షర హాసన్

పోలీస్ స్టేషన్ కెక్కిన అక్షర హాసన్

 Akshara Haasan approaches Mumbai Police leaks of private picsతన ప్రైవేట్ ఫోటోలు ఎవరో కావాలని లీక్ చేసారని ముంబాయి పోలీసులను ఆశ్రయించింది కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ . కొద్దిరోజుల క్రితం అక్షర హాసన్ ఇన్నర్ వేర్ లో ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే . అయితే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో పెద్ద దుమారమే రేగింది . తన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ ఈ భామ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ భామే ఆ ఫోటోలను లీక్ చేసి ఉంటుందని లేదా తానే ఎవరి చేతనైనా చేయించి ఉంటుందని గుసగుసలు మొదలు కావడంతో ఎట్టకేలకు స్పందించి ముంబాయి పోలీసులను ఆశ్రయించింది .

- Advertisement -

తన ఫోటోలను లీక్ చేసిన వాళ్ళ పని పట్టండి అని ఫిర్యాదు చేసింది . అక్షర హాసన్ ఫిర్యాదు చేసింది కాబట్టి పోలీసులు ఇక ఆ పనిలో పడనున్నారు . కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలని అక్కలా స్టార్ డం పొందాలని ఆశించింది కానీ ఆ చాన్స్ ఈ భామకు దక్కలేదు మరి . ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరోవైపు నటిగా కూడా ప్రయత్నాలు చేస్తోంది అక్షర హాసన్ .

English Title:  Akshara Haasan approaches Mumbai Police leaks of private pics

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts