Homeటాప్ స్టోరీస్బన్నీ కి పోటీ గా చైతు..

బన్నీ కి పోటీ గా చైతు..

akkineni naga chaitanya swiigy commercial ad

అక్కినేని నాగ చైతన్య వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. అంతే కాదు విభిన్న కథలలో నటించేందుకు కూడా సై అంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమాలో ఓ చిన్న రోల్ లో నటించగా..ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ గా మారాడు. ఇక ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ కే పోటీగా దిగాడు.

తాజాగా నాగ చైతన్య ఆన్‌లైన్‌లో ఫుడ్ యాప్ అయిన స్విగ్గి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో నటించాడు. దీనికి సంబదించిన వీడియో ను తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపాడు. మరోపక్క అల్లు అర్జున్ ఆన్‌లైన్‌లో ఫుడ్ యాప్ అయిన జొమాటో యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే..విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో థాంక్యూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇందులో చైత‌న్య మూడు డిఫరెంట్ షేడ్స్‌లో క‌నిపించ‌బోతున్నారు. దిల్ రాజు నిర్మాత‌.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All