
అక్కినేని అఖిల్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భాంగా ఆయనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో విషెష్ అందజేస్తున్నారు. అభిమానులు , సినీ ప్రముఖులు బెస్ట్ విషెష్ అందజేస్తూ వరి ప్రేమను , అభిమానాన్ని పంచుకుంటున్నారు. ఈ తరుణంలో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ లో ఈ పోస్టర్ లో సిగరేట్ తాగుతూ..సిక్స్ ప్యాక్ బాడీ తో అఖిల్ కనిపించాడు.
వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్ స్పైగా కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్నాడు.
- Advertisement -