Homeటాప్ స్టోరీస్పూరి కొడుకు పక్కన కొత్త పోరి

పూరి కొడుకు పక్కన కొత్త పోరి

Akash puri next movie Vasco da gama ఆకాష్ పూరి పక్కన కొత్త పోరి ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ . హీరోగా తన కొడుకుని రీ లాంచ్ చేసిన చిత్రం కూడా ప్లాప్ కావడంతో ఈసారి నేను కాదు అంటూ అతడు మెగా ఫోన్ ని పక్కన పెట్టి తన దగ్గర దర్శత్వశాఖలో పనిచేసిన అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరి . ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మోడల్ గాయత్రి భరద్వాజ్ ని పరిచయం చేస్తున్నాడు . గాయత్రి భరద్వాజ్ చూడ చక్కగా ఉండటంతో ఈ భామ టాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది . మోడల్ గా రాణిస్తున్న ఈ హాట్ భామ సిల్వర్ స్క్రీన్ పై ఎలా మెరుస్తుందో చూడాలి .

ఇక ఈ సినిమాకు ” వాస్కోడగామా ” అనే టైటిల్ ని పెట్టె పనిలో పడ్డాడు పూరి . మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రం కూడా లవ్ ని మిక్స్ చేసాడు పూరి . గతకొంత కాలంగా విజయాలు లేక ఆర్ధికంగా , హార్దికంగా చితికిపోతున్నాడు పూరి జగన్నాధ్ . అయినప్పటికీ తన కొడుకుని హీరోగా నిలబెట్టడానికి మళ్ళీ మళ్ళీ రిస్క్ చేస్తూనే ఉన్నాడు . మెహబూబా అనే సినిమా చేసి నిండా మునిగాడు పూరి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కొడుకుతో సినిమా చేస్తున్నాడు . మరి ఇది ఏమౌతుందో చూడాలి .

- Advertisement -

 

English Title:  Akash puri next movie Vasco da gama

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All