
అజిత్ హీరోగా హెచ్ వినోథ్ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ఎక్స్ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటించడం విశేషం. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. భారీ అంచనాల మధ్య ఈరోజు తమిళ్ , తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరుణంలో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా సినిమా ఎలా ఉందనేది తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం వీరి చెపుతున్న దాని ప్రకారం సినిమాకు డివైడ్ టాక్ వస్తుంది. వలిమై కోసం అజిత్ వంద శాతం ఎఫర్ట్ పెట్టి పని చేశారని కొంతమంది అంటుంటే, రొటీన్ స్క్రీన్ ప్లే, ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ లేవని మరికొంతమంది అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఛేజ్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం యావరేజ్‌గా సాగిపోతుందని చెబుతున్నారు. ఇది చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కార్తికేయ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఫస్టాఫ్, సినిమాటోగ్రఫి సినిమాకు హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు. ఇక రన్ టైం మూడు గంటలు ఉండడం సినిమాకు మరింత మైనస్ అయ్యిందని చెపుతున్నారు. రన్ టైం తగ్గిస్తే బాగుండేదని కామెంట్స్ వేస్తున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ టాక్ యావరేజ్ అని చెపుతున్నారు.