Homeటాప్ స్టోరీస్పొలిటికల్ ఎంట్రీ ఫై అజిత్ క్లారిటీ

పొలిటికల్ ఎంట్రీ ఫై అజిత్ క్లారిటీ

ajith clarity to political entry
ajith clarity to political entry

చిత్రసీమకు , రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. చిత్రసీమలో రాణించిన చాలామంది రాజకీయాల్లో రాణించి వారికంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తున్న వారు ఉన్నారు..రాజకీయాల్లో ఓటమి చెంది మళ్లీ సినిమాలు చేస్తున్నవారు ఉన్నారు. ఇంకొంతమంది రెండిట్లో రాణిస్తున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు గత కొద్దీ రోజులుగా తమిళ్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ఎంట్రీ ఫై అజిత్ క్లారిటీ ఇచ్చారు.

తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఇదే విషయంపై ఆయన పర్సనల్ మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ.. అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నామని తెలిపారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా వలిమై మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జీ స్టూడియోస్‌ , బేవ్యూ ప్రాజెక్ట్స్‌ బ్యానర్స్‌పై బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఇనుమూరి గోపీచంద్‌ విడుదల చేయగా హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. అజిత్ , కార్తికేయ, హుమా ఖురేషి, సుమిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. కానీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All