
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రివ్యూ:
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ
సంగీతం : మార్క్ కె. రాబిన్
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
దర్శకత్వం : స్వరూప్
రేటింగ్ : 3 / 5
విడుదల తేదీ : 21 జూన్ 2019
డిటెక్టివ్ నేపథ్యంలో వచ్చిన చిత్రం ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ . నవీన్ పొలిశెట్టి , శ్రుతి శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి స్వరూప్ దర్శకత్వం వహించాడు. నక్కా రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా !
కథ :
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి ) నెల్లూరు లో డిటెక్టివ్. ఏవో చిన్న చిన్న కేసులు పరిష్కరిస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆత్రేయ కు అనాధ శవాలపై పరిశోధన చేస్తున్న సమయంలో ఆత్రేయ ని చంపడానికి ఆగంతకులు ప్రయత్నిస్తారు. అసలు అనాధ శవాలు ఎక్కడివి ? ఆత్రేయ ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలైట్స్ :
నవీన్ పొలిశెట్టి
కథనం
ఎంటర్ టైన్ మెంట్
డైరెక్షన్
డ్రా బ్యాక్స్ :
బలమైన విలన్ లేకపోవడం
నటీనటుల ప్రతిభ :
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పాత్రలో నవీన్ పొలిశెట్టి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పంచ్ డైలాగ్స్ తో పాటుగా తనదైన యాటిట్యూడ్ తో మెప్పించాడు నవీన్ . ఈ చిత్రానికి నవీన్ నటన హైలెట్ గా నిలిచింది.
హీరోయిన్ పాత్రలో శ్రుతి శర్మ బాగా మెప్పించింది. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
విజువల్స్ బాగున్నాయి, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు విషయానికి వస్తే….. డిటెక్టివ్ నేపథ్యాన్ని ఎంచుకొని చాలా మంచి ప్రయత్నం చేసాడు.ఏజెంట్ కథకు ఎంటర్ టైన్ మెంట్ ని అలాగే సరైన స్క్రీన్ ప్లే ని ఎంచుకొని సరైన దిశలో నడిపించి సక్సెస్ అయ్యాడు స్వరూప్.
ఓవరాల్ గా :
తప్పకుండా చూడాల్సిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.