Homeటాప్ స్టోరీస్ఒకసారి హిట్ హీరో అనే పేరు వచ్చింది అంటే ఏదైనా చేసేస్తాడు

ఒకసారి హిట్ హీరో అనే పేరు వచ్చింది అంటే ఏదైనా చేసేస్తాడు

ఒకసారి హిట్ హీరో అనే పేరు వచ్చింది అంటే ఏదైనా చేసేస్తాడు
ఒకసారి హిట్ హీరో అనే పేరు వచ్చింది అంటే ఏదైనా చేసేస్తాడు

క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు ఇలా వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో ‘అడవి శేష్’ గారు. వరుసగా 4 హిట్ సినిమాలు మధ్య మధ్యలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ సినిమాలా విజయంలో కూడా భాగం అయ్యాడు. ఉదాహరణకి బాహుబలి, ఓ బేబీ, ఊపిరి సినిమాలు కూడా ఉన్నాయి మన వాడి నటన పరంగా చెప్పుకోవాలంటే.అందుకే టాలీవుడ్ లో అడివి శేష్ సినిమాల మీద జనాలకి ఆసక్తి పెరిగింది.

ఒకసారి హిట్ హీరో అనే పేరు వచ్చిందంటే ఆ పేరుని కాపాడుకోవడం చాలా కష్టం. మధ్యలో ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే మళ్ళీ తిరిగి హిట్ కొట్టేదాకా ప్రజలు అడవి శేష్ ని గుర్తు పెట్టుకోరు. అందుకే ఆ హిట్ హీరో అనే పదాన్ని తన ప్రతి సినిమాకి ఉంచుకునేలా చేసుకుంటున్నాడు. అలా రాబోయే ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ, కథని, కథనాన్ని కొత్తగా ఉండేలా చేసుకుంటున్నాడు. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ‘మేజర్’ సినిమాని కూడా అలానే ఉండేలా చూసుకుంటున్నాడు.

- Advertisement -

సినిమాలో అడివి శేష్ మేజర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ సినిమా 26 /11 ముంబయి దాడి నేపథ్యం గురించి అందులో అమరుడు అయిన మేజర్ ఉన్ని కృష్ణన్ పాత్రలో జీవించేస్తున్నాడు అని సినిమా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పాత్ర అంత సులభం కాదు అంట. ఉన్ని కృష్ణన్ పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ గా చూపించబోతున్నారు. ఒక పక్క మేజర్ పాత్రలో ఫిట్ బాడీ ఉంటే ఇంకొక పక్క కుర్రాడిలా ఉండబోతుంది అంటా. అందుకే అడివి శేష్ గారు స్ట్రిక్ట్ డైట్ పాటిస్తూ 10 కిలోల బరువు కూడా తగ్గారు అంట.

ఇకపోతే ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ సినిమా దర్శకులు ‘శశి కిరణ్ తిక్క’ గారు డైరెక్ట్ చేస్తున్నారు. మేజర్ సినిమా పూర్తి అవ్వగానే వెంటనే ‘గూఢచారి 2’ సినిమా ని కూడా డైరెక్ట్ చేస్తారు. సోని పిక్చర్స్ సంస్థ అధినేతలతో కలిసి మన ప్రిన్స్ ‘మహేష్ బాబు’ గారు ఈ మేజర్ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All