Homeటాప్ స్టోరీస్రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు - ఫ్యామిలీ ఎంటర్టైనర్

రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు – ఫ్యామిలీ ఎంటర్టైనర్

రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు – ఫ్యామిలీ ఎంటర్టైనర్
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక తదితరులు
డైరెక్టర్ : కిషోర్ తిరుమల
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ
నిర్మాత : సుధాకర్‌ చెరుకూరి
టాలీవుడ్ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : మార్చి 4 , 2022

adavallu meeku joharlu Review
adavallu meeku joharlu Review

శర్వానంద్, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. గత వారమే విడుదల అవ్వాల్సి ఉండగా..భీమ్లా నాయక్ రిలీజ్ కారణంగా ఈరోజు కు వాయిదా పడింది. పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? శర్వా- రష్మిక నటన ఎలా ఉంది..? ప్లస్ ..మైనస్ ..? అనేవి ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ :

పెద్ద ఫ్యామిలీ లో పెరిగిన అబ్బాయి చిరంజీవి (శర్వానంద్). చిరంజీవి అంటే ఇంటిల్లిపాది ఎంతో ఇష్టం. పెళ్లి వయసు రావడం తో చిరంజీవి కి పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు అమ్మాయిలను వెతకడం మొదలుపెడతారు. చిరంజీవి కి నచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఆడవారికి నచ్చకపోవడం తో చిరంజీవి డిస్పాయింట్ అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆద్య (రష్మిక ) ను చూసి ఇష్టపడతాడు. చిరంజీవి – ఆద్య ఇద్దరు త్వరగానే ప్రేమలో పడతారు. ఆద్య..చిరంజీవి ఇంట్లో కూడా నచ్చడం తో వీరిద్దరికి పెళ్లి చేయాలనీ అనుకుంటారు. కానీ ఆద్య వాళ్ల అమ్మ వకుళ (కుష్బూ) కు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు..? దానికి కారణాలు ఏంటి..? ఆ కారణాలు తెలుసుకున్న చిరంజీవి ఏంచేస్తాడు..? ఆద్య తల్లి మాటను గౌరవిస్తుందా..లేదా..? అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* కథ

* ఫస్ట్ హాఫ్

* శర్వానంద్ – రష్మిక ల కెమిస్ట్రీ

మైనస్ :

* సెకండ్ హాఫ్

* మ్యూజిక్

* స్క్రీన్ ప్లే

నటీనటుల తీరు :

* శర్వానంద్ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు. రష్మిక – శర్వాల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి . అలాగే శర్వా – ఊర్వశి ల మధ్య సాగే కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

* రష్మిక ఎప్పటిలాగానే గ్లామర్ గానే కాక నటనతోను ఆకట్టుకుంది

* సీనియర్ నటులైన ఖుష్బూ, రాధిక, ఊర్వశి, రాజశ్రీ నాయర్‌, సత్యకృష్ణన్‌, కల్యాణి నటరాజన్‌, ఝాన్సీ, రజిత, ప్రదీప్‌ రావత్‌, సత్య తదితరులు వారి నటన మేరకు ఆకట్టుకున్నారు.

* వెన్నెల కిషోర్ మరోసారి ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు

సాంకేతిక వర్గం :

* ఈ మధ్య దేవి శ్రీ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. పుష్ప తప్ప మారే ఏ సినిమా సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ మూవీ లో కూడా అదే రిపీట్ అయ్యింది. ఒకటి , రెండు సాంగ్స్ తప్ప మిగతావేవీ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

* ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ చేస్తే బాగుండు

* నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి

* ఇక డైరెక్టర్ కిషోర్ విషయానికి వస్తే..మంచి కథ రాసుకున్నప్పటికీ..దానిని తెరపై చూపించడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే చిరాకు తెప్పించింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్పీడ్ ..సెకండ్ హాఫ్ లో లేకపోవడం , అనూహ్యమైన ట్విస్టులు లేకపోవడంతో కథ సాదాసీదాగా సాగడం కాస్త బోర్ కొట్టించింది. దానిని ఇంకాస్త చూసుకునే బాగుండు. వకుళ, సరిత స్ట్రిక్ట్ గా మారడానికి గల కారణాన్ని ఇంకాస్త ఎలాబరేట్‌గా చెప్పి ఉంటే బావుండేది.

అలాగే సెంటిమెంట్ సన్నివేశాలు సైతం ఇంకాస్త పండాల్సి ఉంది. ఓవరాల్ గా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలు రాలేదు. అదికాక సీనియర్ నటీమణులంతా ఒకే సినిమా లో చూసే ఛాన్స్ కూడా ఈ సినిమాతో దక్కడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఒక్కసారైనా చూసేందుకు ఇష్టపడతారు.

ఫైనల్ గా : ఫ్యామిలీ ఆడియన్స్ చూసే చిత్రం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All