
శర్వానంద్, రష్మిక జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం మార్చి 04 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. సోనీ లివ్ ప్లాట్ ఫారమ్‌లో ఏప్రిల్ 14 నుండి ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మరి ఓటిటి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
- Advertisement -