
హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించిన అదా శర్మ తొలిసారి మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తున్న చిత్రం `క్వశ్చన్ మార్క్ ?`. కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై విప్రా దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్, అభయ్, భానుశ్రీ కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా `రామ సక్కనోడివిరో..` అంటూ సాగే పాటని చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. మంగ్లీ పాడగా రఘు కుంచె స్వరాలు సమకూర్చారు. శంకర్ నృత్య దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె మాట్లాడుతూ `ఈ చిత్రంలో మొదటి పాట పెట్టాలనుకోలేదు. షూటింగ్ పూర్తయ్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి సత్యం అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాటలో అదాశర్మ స్టెప్పులతో అదరగొట్టింది. నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. ఈ పాటతో దర్శకుల పనితీరు తెలుస్తోంది. ఈ పాండమిక్ టైమ్‌లో సినిమా చేయడం సంతోషించదగ్గ విషయం` అన్నారు.
నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ `ఈ పాట క్రెడిట్ మొత్తం రఘు కుంచెకే వెళుతుంది. అదా శర్మ ఈ మూవీ కోసం ఎంతో శ్రమించారు. తన పెర్ఫార్మెన్స్‌తో పాటు తన డ్యాన్సింగ్ టాలెంట్‌ని కూడా బయటపెట్టింది.
శేఖర్ మాస్టర్ ఈ పాటకు ప్రాణం పోశారు. మూవీ రిలీజ్ సన్నాహాల్లో వున్నాం` అన్నారు. సినిమాలో పాట పెట్టాలని అనుకున్నప్పుడు రఘుకుంచె మంచి పాట ఇచ్చారు` అని దర్శకులు తెలిపారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. నేను తెలుగులో చేసిన చిత్రాలన్నీ నటనకు ఆస్కారం వున్నవే. కరోనా టైమ్‌లో మొదలై కరోనా టైమ్‌లోనే రిలీజ్ అవుతున్న సినిమా ఇది`అని అదా తెలిపింది.