Homeటాప్ స్టోరీస్నటి వనితని అరెస్ట్ చేసిన పోలీసులు

నటి వనితని అరెస్ట్ చేసిన పోలీసులు

Actress Vanitha arrested by tamil nadu policeసీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు నటి వనితని అరెస్ట్ చేసారు చెన్నై పోలీసులు . గతకొంత కాలంగా తండ్రీ కూతుళ్లయిన విజయ్ కుమార్ – వనితల మధ్య ఆస్తులకు సంబంధించి పలు వివాదాలు నడుస్తున్నాయి . రెండు మూడేళ్ళ నుండి ఈ వివాదాలు జరుగుతున్నాయి కానీ ఓ కొలిక్కి మాత్రం రావడం లేదు . ఆస్థుల వివాదం సీరియల్ లా సాగుతూనే ఉన్నాయి . తాజాగా కూడా అదే వివాదంతో వనితని అరెస్ట్ చేసారు పోలీసులు .

అష్టలక్ష్మి నగర్ లో విజయకుమార్ కు ఓ బిల్డింగ్ ఉంది దాన్ని షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తుంటాడు కాగా మా సినిమా షూటింగ్ ఉంది అది అద్దెకు కావాలని కూతురు వనిత అడగడంతో అనుమానంగానే ఇచ్చాడట అయితే అనుమతి ఇవ్వడమే ఆలస్యం అందులో తిష్ట వేసి ఖాళీ చేయకపోవడంతో ఆమెని బలవంతంగా ఖాళీ చేయించాడు విజయ్ కుమార్ . ఆ గొడవలో తండ్రీ కూతుర్లు ఇద్దరూ కొట్టుకున్నారు కూడా . అయితే అక్కడి నుండి వెళ్లిన వనిత కోర్టుని ఆశ్రయించింది కూడా ,మళ్ళీ మరోసారి ఇంట్లోకి వచ్చి ఉండటంతో ఆమెని అరెస్ట్ చేసారు పోలీసులు . వనిత ఇంతకుముందు టాలీవుడ్ లో కూడా నటించింది దేవి అనే చిత్రంలో నటించింది .

- Advertisement -

English Title: Actress Vanitha arrested by tamil nadu police

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All