
సీనియర్ నటి టబు ఎట్టకేలకు అల్లు అర్జున్ సినిమాలోకి ఎంటర్ అయ్యింది . త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . టబు పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకులు త్రివిక్రమ్ . దాంతో ఆమె పాల్గొన్న సమయంలో తీసిన కొన్ని విజువల్స్ తో ఓ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్ .
- Advertisement -
టబు చీరకట్టు లోమరింత అందంగా ఉంది , అయితే ఈ హాట్ భామ ఇందులో హాట్ గా కాకుండా హోమ్లీ పాత్రలో కనిపించనుంది . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .
- Advertisement -