Homeటాప్ స్టోరీస్పెళ్లి వీడియోని షేర్ చేసిన భామ

పెళ్లి వీడియోని షేర్ చేసిన భామ

Actress Sushmita sen shares Karthikeya wedding video దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి – రమా ల తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ వివాహ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే . అందులో బాలీవుడ్ భామ సుస్మితా సేన్ కూడా హాజరయ్యింది తన బాయ్ ఫ్రెండ్ తో . ఈ భామ కొంతకాలంగా రోహ్మాన్ షాల్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే తనకు కాబోయే వాడ్ని పరిచయం చేసింది సుస్మితా సేన్ .

తాజాగా ఈ భామ రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన కార్తికేయ వివాహానికి హాజరయ్యింది . ఆ వేడుకలో ప్రభాస్ తో పాటుగా ఇతర ప్రముఖులను కూడా కలిసింది . ఇక కార్తికేయ ని ఆశీర్వదిస్తూ పెళ్లి తాలూకు వీడియో ని పోస్ట్ చేసింది సుస్మితా సేన్ . ప్రభాస్ తో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది సుస్మితా సేన్ . ఈ భామ దక్షిణాది చిత్రాల్లో కూడా నటించింది కానీ ఐశ్వర్యారాయ్ లా సంచలనం సృష్టించలేక పోయింది .

- Advertisement -

English Title: Actress Sushmita sen shares Karthikeya wedding video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All