Homeటాప్ స్టోరీస్లెజెండ్ నటి ఇక లేరు

లెజెండ్ నటి ఇక లేరు

Actress Sujata Kumar no more నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రంలో బాలయ్య కు బామ్మగా నటించిన సీనియర్ నటి ” సుజాత కుమార్ ” చనిపోయింది . నిన్న రాత్రి ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది సుజాత కుమార్ . గతకొంత కాలంగా సుజాత కుమార్ మెటా స్టాటిక్ అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది అయితే చికిత్స కోసం ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చేరింది కానీ అప్పటికే వ్యాధి ముదరడంతో కన్నుమూసింది . సుజాత కుమార్ చనిపోయిన విషయాన్నీ ఆమె సోదరి కృష్ణకుమారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .

సుజాత కుమార్ శ్రీదేవి నటించిన ” ఇంగ్లిష్ – వింగ్లిష్ ” చిత్రంలో నటించింది . ఆ సినిమా సుజాత కుమార్ కు మంచి పేరు తెచ్చింది , ఆ సినిమాతో పాటుగా బాలయ్య లెజెండ్ లో నటించింది అంతేకాదు తెలుగులో పలు చిత్రాల్లో కూడా నటించింది . సీరియల్ లలో కూడా నటించిన సుజాత కుమార్ అరుదైన క్యాన్సర్ తో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రం లో మునిగింది .

- Advertisement -

English Title: actress sujata kumar no more

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All