Homeటాప్ స్టోరీస్ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కడానికి ఒప్పుకుంది

ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కడానికి ఒప్పుకుంది

ఒంటి మీదకు 35 ఏళ్ళు వచ్చాయి అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ నిన్న మొన్నటి వరకు శ్రియా నీ పెళ్ళెప్పుడు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవారు కట్ చేస్తే ఇప్పుడు మార్చిలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది శ్రియా . రష్యా కి చెందిన బాయ్ ఫ్రెండ్ తో కొంతకాలంగా ప్రేమలో ఉంది శ్రియా , అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట . ఇరు కుటుంబాలు కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో మార్చిలో శ్రియా శరన్ ఓ ఇంటిది కానుంది . డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట కూడా .

తెలుగు , తమిళ , హిందీ బాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమై 16 ఏళ్ళు అవుతోంది . మధ్యలో కాస్త కెరీర్ పరంగా వెనుకబడినప్పటికీ గత రెండేళ్లుగా మళ్ళీ పుంజుకుంది . బాలకృష్ణ , నాగార్జున , మోహన్ బాబు ల సినిమాలలో నటించి ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని చాటిచెబుతోంది శ్రియా శరన్ . అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ 65 ఏళ్ళు వచ్చినా కూడా నటిస్తూనే ఉంటాను తప్ప నటనకు గుడ్ బై చెప్పేది లేదని అంటోంది ఈ భామ . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All