Homeటాప్ స్టోరీస్నాటితరం హీరోయిన్... ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది

నాటితరం హీరోయిన్… ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది

నాటితరం హీరోయిన్... ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది
నాటితరం హీరోయిన్… ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది

నటి ప్రేమ గుర్తుందా? 90లలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది ప్రేమ. తర్వాత క్యారెక్టర్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తోంది. విక్టరీ వెంకటేష్ సరసన ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రేమ. ఆ తర్వాత చేసిన దేవి చిత్రం ఆమె కెరీర్ కు పెద్ద బ్రేక్ ను ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా చేసిన ప్రేమ, కన్నడలో స్టార్ స్టేటస్ ను అందుకుంది.

రీసెంట్ గా ప్రేమ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆమె స్పందించింది. రెండో పెళ్లి రూమర్లలో అసలు నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే హాయిగా ఉన్నట్లు తెలిపింది. జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ప్రేమ ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటినుండి సింగిల్ లైఫ్ ను గడుపుతోంది.

- Advertisement -

ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో కానీ ప్రేమ రెండో పెళ్లి వార్తలు రావడంతో ఆమె స్పందించాల్సి వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All