Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఆత్మహత్య చేసుకున్న నటి

ఆత్మహత్య చేసుకున్న నటి

actress payal chakraborty commits suicideపశ్చిమ బెంగాల్ కు చెందిన సినీ నటి , బుల్లితెర నటి అయిన పాయల్ చక్రబోర్తి (38) ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టిస్తోంది . నిన్న ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు . పలు బెంగాలీ చిత్రాల్లో నటించిన పాయల్ బుల్లితెర నటి కూడా ప్రస్తుతం పలు షోలు చేస్తోంది కూడా అయితే కొంతకాలంగా భర్త కు దూరంగా ఉంటోంది . భర్తతో వచ్చిన విబేధాలతో తన కొడుకుతో కలిసి ఉంటోంది . అయితే అకస్మాత్తుగా సిలిగురి లోని ఓ హోటల్ లో ఉరి వేసుకుంది దాంతో పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు .

- Advertisement -

సిలిగురి లోని హోటల్ కు వచ్చిన పాయల్ చక్రబోర్తి భోజనం చేయకుండా తలుపులు పెట్టేసుకోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది పాయల్ దాంతో షాక్ తిన్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు . ప్రాధమిక దశలో ఆత్మహత్య గా నిర్దారణ చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి విచారణ తర్వాతే అసలు విషయం చెబుతామని అంటున్నారు పశ్చిమ బెంగాల్ పోలీసులు .

English Title: actress payal chakraborty commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts