Homeగాసిప్స్సూపర్ హిట్ సినిమా మిస్ అయినందుకు బాధపడుతోంది

సూపర్ హిట్ సినిమా మిస్ అయినందుకు బాధపడుతోంది

అరుంధతి ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే , ఆ సినిమా అనుష్క కెరీర్ నే మలుపు తిప్పింది గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలు వచ్చేలా …… హీరోలతో సమానమైన ఇమేజ్ వచ్చేలా చేసింది అరుంధతి . అయితే అంతటి సంచలన చిత్రాన్ని వదులుకుంది హీరోయిన్ మమతా మోహన్ దాస్ . మొదట అరుంధతి లో నటించమని మమతా మోహన్ దాస్ నే అడిగారట కానీ అప్పట్లో సినిమాల సెలెక్షన్ అంతగా తెలియకపోవడంతో లేడీ ఓరియెంటెడ్ సినిమా కదా ! అని లైట్ గా తీసుకుందట .

కట్ చేస్తే ఆ ఛాన్స్ అనుష్క ని వరించడం అది పెద్ద హిట్ కావడం అంతటి సంచలన చిత్రాన్ని మిస్ చేసుకున్నానని చాలా బాధపడిందట మమతా మోహన్ దాస్ . మలయాళ ముద్దుగుమ్మ అయిన ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది . అయితే కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే కేన్సర్ బారిన పడటంతో కెరీర్ కంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి చాలా సినిమాలను వదులుకొని ట్రీట్ మెంట్ తీసుకుంది కట్ చేస్తే ఇప్పుడు కేన్సర్ ని జయించింది మమతా మోహన్ దాస్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All