Homeటాప్ స్టోరీస్పోలీస్ స్టేషన్ వద్ద నటి హేమ హల్చల్

పోలీస్ స్టేషన్ వద్ద నటి హేమ హల్చల్

ర్యాడిసన్ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. శనివారం రాత్రి పోలీసులు ఈ పబ్ ఫై దాడి చేయగా..దాదాపు 150 మంది పట్టుబడ్డారు. వీరిలో సినీ ప్రముఖుల కూతుళ్లు , కుమారులతో పాటు రాజకీయ నేతల వారసులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో నటి హేమ పేరు ఓ మీడియా ఛానల్ వారు ప్రసారం చేయడం తో హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని వ్యవహారం లో తన పేరు ఎలా ప్రసారం చేస్తారనే ఆమె అగ్రం వ్యక్తం చేస్తూ…సదరు ఛానల్ ఫై పోలీసులకు పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడ మీడియా తో మాట్లాడుతూ కోపంతో ఊగిపోయారు.

- Advertisement -

మరోపక్క ఈ పబ్ వ్యవహారం తో తనకు సంబంధం లేదని గల్లా అశోక్ తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.” అంటూ గల్లా కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts