Homeగాసిప్స్డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి

Actress Aswathy Babu arrested in drugs case
Aswathy Babu

తెలుగునాట సంచలనం సృష్టించిన కేసు డ్రగ్స్ , అయితే అప్పట్లో కొంతమందికి నిద్ర లేకుండా చేసి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది ఆ సంఘటన , కట్ చేస్తే ఆ కేసు ఇప్పుడు పక్కకు పోయిందననుకోండి . తాజాగా డ్రగ్స్ కేసులో మలయాళ నటి అశ్వతి బాబు అరెస్ట్ అయ్యింది . డ్రగ్స్ అమ్మడానికి తన ఇంటి సమీపంలో ఓ కస్టమర్ కోసం ఎదురు చూస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అశ్వతి బాబు ని అరెస్ట్ చేసారు కేరళ పోలీసులు .

సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న కేరళలో జరిగింది . మలయాళ సీరియల్ లలో నటించిన అశ్వతి బాబు అనే నటి ఈజీ మని కోసం ఇలా అడ్డదార్లు తొక్కేసింది . డ్రగ్స్ అమ్మకం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు ఆర్జించవచ్చు అని నిర్దారణకు వచ్చిన ఈ మహిళ పరువు , మర్యాదలను పక్కన పెట్టేసింది . అశ్వతి బాబు నుండి 5 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె వెనకాల డ్రగ్స్ మాఫియా ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు . అశ్వతి బాబు తో పాటుగా ఆమె డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేసారు పోలీసులు . ఈ సంఘటన ఇప్పుడు కేరళలో సంచలనం సృష్టిస్తోంది .

- Advertisement -

English Title: Actress Aswathy Babu arrested in drugs case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All