Homeటాప్ స్టోరీస్పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన `నువ్వు- నేను` భామ‌!

పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన `నువ్వు- నేను` భామ‌!

actress Anitha asandani blessed with a baby boy
actress Anitha asandani blessed with a baby boy

ఉద‌య్‌కిర‌ణ్ న‌టించిన `నువ్వు – నేను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటి అనితా అసానందాని. తెలుగులో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న‌ప అనిత తెలుగులో ఆ త‌రువాత చాలా చిత్రాల్లో న‌టించింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసిన అనిత రోహిత్‌రెడ్డిని వివాహం చేసుకుంది. ఇటీవ‌ల ప్రెగ్నెంట్ అయిన అనిత‌ నిన్న పండంటి అబ్బాయిని ప్రసవించింది. అనిత భర్త రోహిత్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.

అనితా హసానందాని, రోహిత్ దంపతులు చాలా రోజులుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారు ఒక బిడ్డకు గర్వంగా తల్లిదండ్రులు. అనిత గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌రి నుంచి ఈ జంట  సంబరాలు చేసుకుంటోంది. బేబీ బంప్ తో ప్ర‌త్యేకంగా ఫొటో షూట్‌ని కూడా నిర్వ‌హించుకున్న ఈ జంట ఆ ఫొటోల‌ని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

ప్రెగ్నెన్సీ ప్రకటన నుండి ఇటీవలి ప్రసూతి ఫోటోషూట్ వరకు, అనితా రోహిత్ జంట ప్రతి అందమైన సంద‌ర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనిత భ‌ర్త రోహిత్ రెడ్డి బాబు పుట్టిన తేదీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన అందుకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు. అనిత్ బేబీ బంప్‌తో వున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All