Homeటాప్ స్టోరీస్ఆస్థుల గొడవ మళ్ళీ మొదలయ్యింది

ఆస్థుల గొడవ మళ్ళీ మొదలయ్యింది

Actor vijay kumar complaint on daughter vanitha తమిళ నటుడు విజయ్ కుమార్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే . తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఫేమస్ అయిన విజయ్ కుమార్ తన కూతురు వనిత ల మధ్య కొంతకాలంగా ఆస్థులకు సంబంధించి నిత్యం గొడవలు అవుతూనే ఉన్నాయి . వనిత తెలుగులో దేవి చిత్రంలో నటించింది , ఆపై ఇంట్లో వాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకుంది కానీ అతడితో ఎక్కువ కాలం లేకుండానే విడిపోయింది కట్ చేస్తే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతడితో కూడా విడిపోయింది వనిత . ఒకరితో ఐదేళ్లు కాపురం చేసి విడిపోయాక మళ్ళీ మరొకరితో మూడేళ్లు కాపురం చేసి విడిపోయింది .

ఇక ఇపుడేమో తండ్రి విజయ్ కుమార్ తో కూడా చాలాకాలంగా విభేదిస్తోంది . చెన్నై మహానగరంలో గల అలపాక్కం అష్టలక్ష్మి నగర్ లో విజయ్ కుమార్ కు ఇల్లు ఉంది అయితే ఆ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఇవ్వాలని తండ్రిని కోరడంతో ఇచ్చాడు కట్ చేస్తే షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ ఆ ఇల్లు ఖాళీ చేయకుండా తన ఆధీనంలోనే ఉంచుకుంది . దాంతో విజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు . కూతురు – తండ్రి మధ్య గొడవ ముదరడంతో రోడ్డున పడ్డారు . ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు . ఆస్థుల విషయం కాబట్టి కోర్టు మాత్రమే తేల్చాలి ఇక ఈ కేసుని .

- Advertisement -

English Title: Actor vijay kumar complaint on daughter vanitha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All