Homeటాప్ స్టోరీస్ఎన్నికల బరిలో వేణుమాధవ్

ఎన్నికల బరిలో వేణుమాధవ్

Actor Venumadhav files nomination in kodadaహాస్య నటుడు వేణుమాధవ్ ఎన్నికల బరిలో దిగాడు . టాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో నటించిన వేణు మాధవ్ హీరోగా కూడా నటించాడు . అయితే తాజాగా కోదాడ నియోజకవర్గం నుండి నామినేషన్ వేసాడు నిన్న . వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మిమిక్రీ చేస్తుండేవాడు . అలా తెలుగుదేశం పార్టీ కి వెన్నంటి ఉన్నాడు ఇన్నాళ్లు దాంతో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయాలనీ భావించాడు కానీ ఆ పార్టీ టికెట్ వేణుమాధవ్ కు దక్కలేదు . అందుకే కాబోలు నామినేషన్ అయితే వేసాడు ఇండిపెండెంట్ గా .

ఒకవేళ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ బి ఫామ్ ఇస్తే పార్టీ అభ్యర్థి అవుతాడు లేదంటే ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో నిలబడతానని అంటున్నాడు . అయితే కోదాడ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం మాములు విషయం కాదు . వేణుమాధవ్ సొంత వూరు కోదాడ కావడంతో అక్కడి ప్రజల ఋణం తీర్చుకోవడానికి పోటీ అంటున్నాడు . మరి వేణుమాధవ్ కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందా ? లేక హ్యాండ్ ఇస్తుందా ? చూడాలి .

- Advertisement -

English Title: Actor Venu Madhav files nomination in kodada

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All