Homeటాప్ స్టోరీస్మోడీ పై మళ్ళీ చెలరేగిన ప్రకాష్ రాజ్

మోడీ పై మళ్ళీ చెలరేగిన ప్రకాష్ రాజ్

actor prakash raj fire on pm modiప్రధాని నరేంద్ర మోడీ పై మళ్ళీ చెలరేగిపోయి తీవ్ర విమర్శలు చేసాడు నటుడు ప్రకాష్ రాజ్ . కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ప్రధాని మోడీ తాను కన్నడ వాడినని చెప్పుకోవడమే ప్రకాష్ రాజ్ కోపానికి కారణం . అసలు ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీ మీద , నరేంద్ర మోడీ మీద ఆగ్రహంగా ఉన్నాడు ప్రకాష్ రాజ్ . పలుమార్లు మోడీ ని విమర్శిస్తూ ట్వీట్ చేయడమే కాకుండా కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో కూడా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు .

ఇక మోడీ పై విమర్శల విషయానికి వస్తే …… కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి నేను కూడా కన్నడ వాడినే అని మోడీ పేర్కొనగా ప్రకాష్ రాజ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు . ”మీరు కన్నడిగ గుజరాతీ లో గురజా రాతి , మీరు అబద్దాల కోరు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి …. మతి చలించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కన్నడ వాడిని అని అంటున్నారు లేకపోతే ఏదో ఒక దేశానికి వెళ్లి హాయిగా టీ తాగుతూ ఉండేవాడివి ” అంటూ మోడీ పై విరుచుకు పడ్డాడు ప్రకాష్ రాజ్ . అంతేకాదు ఈ దేశంలో అన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయని కానీ ఏ సిద్ధాంతం లేని పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All