Homeటాప్ స్టోరీస్నిజజీవితంలోనూ మోనార్క్ - ప్రకాష్ రాజ్

నిజజీవితంలోనూ మోనార్క్ – ప్రకాష్ రాజ్

నిజజీవితంలోనూ మోనార్క్ - ప్రకాష్ రాజ్
నిజజీవితంలోనూ మోనార్క్ – ప్రకాష్ రాజ్

తెలిసి రాశారో తెలియక రాశారో కానీ, ఆయనకు నిజంగా ఈ డైలాగ్ అతికినట్లు సరిపోయింది. ఈ ప్రపంచం నీతో మంచిగా ఉండాలంటే, నీతో కలిసి ఉండాలంటే, నువ్వు నీ సొంత వ్యక్తిత్వాన్ని ఎవరికోసం మార్చుకొని.. ఒదిగి ఉండక్కర్లేదు..! నీతో నిజంగా పని ఉంటే, నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచం అన్నీ మూసుకుని నీతో స్నేహం చేస్తుంది. ఈ విషయం ఆయన జీవితాన్ని చూస్తే  మనకు అర్థమవుతుంది. చిన్న కుటుంబం లో పుట్టి, ఎన్నో కష్టాలు పడి, 300 రూపాయలు నెల జీతానికి పనిచేసి, రెండు వేలకు పైగా నాటకాల్లో నటించి ఇప్పుడు భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఎదిగిన  ప్రకాష్ రాజ్ జీవితం నిజంగానే మనకి ఆదర్శం.

 సినిమా ఇండస్ట్రీలో ఆయన నటించిన ఒక  సినిమాలో ఆయన డైలాగ్

- Advertisement -

 “గాలి లేని చోట కూడా నా పేరు రాసి ఉంటుంది. నా పేరు శిల్పి”. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత దర్శకుడు బాలచందర్ వైపు అమాయకంగా ఒక చూపు చూసిన ఆ ఆర్టిస్ట్ ని ఒక్కసారి కౌగిలించుకొని, ఆ పెద్దాయన “ఒరేయ్… రేపు నీ భవిష్యత్తు ఇదే చూసుకో..!” అని అన్నారు. అసలు స్క్రిప్ట్ లో  ఆ డైలాగ్ “నేనెవరో తెలియదా.. పెద్ద నటుడిని” అని ఉంది. కేవలం ఒక మనిషిని కళ్ళతో చూసి వాడి భవిష్యత్తు చెప్పే లెజెండ్ కె.బాలచందర్ ప్రకాష్ రాజ్ ని చూసి డైలాగ్ ని మార్చేశారు. ఆయనే ప్రకాష్ రై గా ఉన్న  పేరుని ప్రకాష్ రాజ్ గా మార్చారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ అనేక భారతీయ భాషలలో వందలాది సినిమాలలో అనేక డిఫరెంట్ క్యారెక్టర్ లు వేశారు.

 ఆయన అద్భుతంగా నటించిన సినిమాలలో ముచ్చటగా మూడు సినిమాలను  గుర్తు చేసుకుంటే తమిళనాడు రాజకీయాలపై మణిరత్నం గారు తీసిన బయోపిక్ ఇద్దరు సినిమాలో కరుణానిధి క్యారెక్టర్, డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన అంతపురం సినిమాలో ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్, దేశం గర్వించదగ్గ మరొక దర్శకుడు ప్రియదర్శన్ గారు తీసిన కాంజీవరం అనే సినిమాలో నిరుపేద చేనేత కార్మికుడి క్యారెక్టర్. తనకు నటుడుగా జన్మనిచ్చిన కె.బాలచందర్ గారి గౌరవార్థం “డ్యూయెట్ మూవీస్” అనే బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించారు

 డైరెక్టర్ గా మెగా ఫోన్ కూడా పార్టీ కన్నడంలో “నన్ను నానా కనసు” అనే సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తరువాత తెలుగు తమిళ భాషలలో “ధోని” అనే సినిమా తీశారు. ఆ తర్వాత “ఒగ్గరినే”, “ఉలవచారు బిర్యాని”,  వంటి సినిమాలు చేశారు. తనకు లైఫ్ ఇచ్చిన బాలచందర్ ని  దేవుడి కంటే గొప్పగా ఆరాధించే ప్రకాష్ రాజ్ నిజజీవితంలో నాస్తికుడు. ఇప్పుడు కొంతమంది ఆయనను ప్రత్యేకంగా హిందుత్వం మీద  విషం కక్కుతున్నాడని అని విమర్శిస్తున్నారు.

కెరీర్ లో ఇంత సక్సెస్ అయిన ప్రకాష్ రాజ్ పర్సనల్ లైఫ్ అంత ప్రశాంతంగా ఏమి ఉండదు.  ప్రకాష్ రాజ్ ఈ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు ఆరుసార్లు బ్యాన్ చేసింది. మొట్టమొదట పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ కంత్రి, అదేవిధంగా అల్లు అర్జున్ పరుగు సినిమా  షూటింగ్ లకు ఆయన  సరిగ్గా హాజరు కాలేదని,  ఎక్కువ శాతం కాంబినేషన్ ఉన్న ఆర్టిస్టులు మరియు సీన్లు ఉన్న సన్నివేశాలలో ఆయన అనుకున్న రోజు షూటింగ్ లకు హాజరు కాకపోవడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లిందని ఆయనపై ప్రధానంగా ఉన్న ఆరోపణ.

 తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఒంగోలు గిత్త సినిమాలో ఆయన నగ్నంగా నటించడం కూడా వివాదానికి దారి తీసింది. మహేష్ బాబు ఆగడు సినిమా షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ మరియు డైరెక్టర్ శ్రీను వైట్ల కి జరిగిన వివాదం  తీవ్ర స్థాయికి వెళ్లింది.  అసిస్టెంట్ డైరెక్టర్ ను బూతులు తిట్టాడని మరియు కొట్టాడని ప్రకాష్ రాజు పై కంప్లైంట్ ఇచ్చారు శ్రీనువైట్ల. దీనికి సమాధానంగా ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో

నన్ను రాళ్లతో కొట్టి చంపకు… పట్టుకొని ఇల్లు కట్టుకుంటా నన్ను  నీకుకాల్చేయ్యలని నిప్పు పెట్టకు…. ఇంటికి దీపం చేసుకుంటా;  దయచేసి చెప్తున్నాను నన్ను చంపాలని విషం పెట్టకు..  మింగి నీలకంఠుని అయిపోతా. అని సమాధానం చెప్పాడు.

అజయ్ దేవగన్ తో ఆయన నటించిన సింగం సినిమా లో హీరోని బెదిరించే సీన్ లో  “కర్ణాటక నుంచి వెయ్యి మందిని దించుతా. నిన్ను నీ ఊరిని నిలువునా తగలబెడతారు…”  అని అంటే హీరో క్యారెక్టర్ “వెయ్యిమంది కుక్కలకి ఒక సింహం సరిపోతుంది” అని డైలాగ్ చెప్తాడు. ఈ సీన్ కన్నడ ప్రజలను అవమానిస్తున్న ట్లుగా ఉందని కూడా పెద్ద దుమారం రేగింది. చివరికి ప్రకాష్ రాజ్, అజయ్ దేవగన్, డైరెక్టర్ రోహిత్ శెట్టి సహా అందరూ క్షమాపణ చెప్పి ఆ సీన్ తీసేశారు.  తాజాగా ఇప్పుడు ప్రకాష్ రాజు ద్రావిడ వాదాన్ని ప్రమోట్ చేస్తూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 ప్రకాష్ రాజ్ కు ఉన్న మరొక అద్భుతమైన లక్షణం,  ఏమాత్రం పబ్లిసిటీ చేసుకోకుండా సమాజ సేవ చేయటం.  ఇప్పుడు అందరూ ఏదో ట్రెండ్ లాగా పాటిస్తున్న..  ఊళ్ళను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడో చేశారు. అది కూడా నటుడిగా ఆయనకు ఎంతో డబ్బు పేరు ప్రతిష్టలు చేకూర్చిన తెలుగు ప్రజల కోసం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి తో సహా పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడకు వెళితే ఆయన ఒక సాధారణ మనిషి లాగా వాళ్లతో కలిసి పోయి తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బండ్లయారుగత్తి  ఈ ప్రాంతాన్ని కూడా దత్తత తీసుకున్నారు.

ఆయనకే కాదు… ప్రజలకు కూడా విసుగు పుట్టి నంత కాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాదర్ క్యారెక్టర్లు చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు మాత్రం తనకు నచ్చితేనే సినిమాలు చేస్తున్నారు. ఆయన లక్ష్యం ఏదైనా…. ఆయన ద్వారా ప్రజలకు మరింత విజ్ఞానం-వినోదం మంచి జరగాలని కోరుకుందాం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All