Homeటాప్ స్టోరీస్జయరాం హత్య కేసులో నటుడి ప్రమేయం

జయరాం హత్య కేసులో నటుడి ప్రమేయం

Actor ping pong surya in murder caseఆ నలుగురు చిత్రంతో పాటుగా టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య పాత్ర జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు . రాకేష్ రెడ్డి కి పింగ్ పాంగ్ సూర్య కు మంచి స్నేహం ఉండటమే కాకుండా జయరాంని రాకేష్ రెడ్డి దగ్గరకు తీసుకురావడంలో సూర్య పాత్ర ఉన్నట్లు తేలడంతో సూర్య ని అదుపులోకి తీసుకొని విచారణ చేసారు పోలీసులు .

 

- Advertisement -

సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . జయరాం అసలు రాకేష్ రెడ్డి కి అప్పు లేకున్నప్పటికీ నాలుగున్నర కోట్లు అప్పు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వాటిపై సంతకాలు తీసుకున్నట్లు పోలీసుల విచారంలో తేలింది . ఈరోజు నిందితుల కస్టడీ ముగుస్తుండటంతో మరిన్ని విషయాలు బయట పడేలా దర్యాప్తు చేయనున్నారు . అయితే నటుడు పింగ్ పాంగ్ సూర్య పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . సినిమాల్లో నటించకుండా ఇలా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఏంటి ? అంటూ సూర్య పై మండిపడుతున్నారు పలువురు .

English Title: Actor ping pong surya in murder case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All