HomeINTERVIEWSనా ఆఖరి కోరిక మాత్రం చిరంజీవిగారి స్థాయిని చేరుకోవడమే.. - యంగ్ హీరో కార్తికేయ

నా ఆఖరి కోరిక మాత్రం చిరంజీవిగారి స్థాయిని చేరుకోవడమే.. – యంగ్ హీరో కార్తికేయ

Kartikeya
Kartikeya

‘ఆర్‌.ఎక్స్‌.100’తో సాలిడ్‌ హిట్‌ కొట్టి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో కార్తికేయ. రెండో ప్రయత్నంగా ఎంతో కాన్ఫిడెంట్ తో తను చేసిన ‘హిప్పి’ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయినా కార్తికేయకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం ‘గుణ 369’ లో హీరోగా చేశారు. అర్జున జంధ్యాల దర్శకుడు. ప్రవీణ కడియాల సమర్పిస్తున్నారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఆగస్టు2న విడుదల కానున్నసందర్బంగా హీరో కార్తికేయ మీడియా వారితో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

* ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
– బోయ్‌ నెక్స్ట్‌ డోర్‌ అని అంటుంటారు కదా. అలా కాదండీ. బోయ్‌ ఇనడోర్‌ అన్నమాట. అంటే మనింట్లో అబ్బాయిలాంటి పాత్రనే ఇందులో నేను పోషించాను. ఒంగోలులో ఓ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి చెందిన కుర్రాడిగా కనిపిస్తాను. మంచి అమ్మ, సపోర్ట్‌ చేసే నాన్న, ముద్దుల చెల్లెలు, గ్రానైట్‌ ప్యాక్టరీలో ఉద్యోగం… పూర్తయ్యీ కానీ బీటెక్‌… వీటన్నిటికి మధ్య, వీధి చివర ఉన్న సెల్‌ఫోన షాప్‌లో పనిచేసే గర్ల్‌ ఫ్రెండ్‌… ఇదన్నమాట నా పరిస్థితి. అలాంటి మధ్య తరగతి కుర్రాడు ఎందుకు తిరగబడ్డాడు? అతన్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టేసిన అంశాలేంటి? వంటివన్నీ ఆసక్తికరం.

- Advertisement -

* టైటిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
– అంటే హీరో గుణవంతుడు. మంచి అబ్బాయి అన్నమాట. ఇందులో ఓ సందర్భంలో నేను జైలుకు వెళ్తాను. అక్కడ నా నెంబర్‌ 369. మామూలుగా గుణ అనే అనుకున్నాం. కానీ కమల్‌హాసనగారి చిత్రంతో పోలిక వస్తుందేమోనని ఆలోచించి, కొనసాగింపుగా 369ను పెట్టాం.

* హిట్,ప్లాప్ లను ఈరు ఏవిధంగా స్వీకరిస్తారు?
– ఆ సినిమా సక్సెస్‌ అయినా, ఫెయిల్‌ అయినా అది అదే… ఇది ఇదే. అది బాగా ఆడినంత మాత్రాన ఈ సినిమా బాగోలేకపోతే దీన్ని చూడరు. ఇది బాగా ఆడనంతమాత్రాన, ఈ సినిమా బావుంటే, దీన్ని చూడకుండా మానరన్నమాట. అంతెందుకు రామ్‌గారికి, పూరిగారికి కొన్నాళ్లుగా హిట్లు లేవు. వాటి ప్రభావం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మీద పడలేదు కదా. ఈ సినిమా చాలా బాగా ఆడింది కదా. నేను ఆ సూత్రాన్ని నమ్ముతాను.

* ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకు వుంది?
– నేను హిప్పీని కూడా జాగ్రత్తలు లేకుండా చేయలేదు. నా పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకునే చేస్తా. కానీ సినిమా అంటే హీరో ఒక్కడే కాదు. వెనుక 100 మంది ఉంటారు. వాళ్లందరి కష్టాన్ని హీరో పోట్రెయిట్‌ చేస్తాడు. కథ అంగీకరించి, సినిమాకు కావాల్సిన గెటప్‌ వేసుకుని, దానికి తగ్గట్టు షూటింగ్‌ చేసి, డబ్బింగ్‌ చేసి, ప్రమోషన్లు చేస్తే హీరో పని పూర్తయినట్టే. అంటే టోటల్‌ సినిమాలో 10 శాతం పని అన్నమాట. అదే సినిమా హిట్‌ అయితే హీరోకు చాలా మంది పేరు వస్తుంది.

* ‘గుణ369’ లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాయింట్ ఏంటి?
– అవునండీ. అంటే ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. నా ‘ఆర్‌.ఎక్స్‌.100’కి ఎంత కనెక్ట్‌ అయ్యానో, ఈ సినిమాకు అలా కనెక్ట్‌ అయ్యా. అంతేగానీ, సినిమా హిట్‌ అయితే, ఆ డబ్బులు కూడా తీసుకుని ఆస్వాదించాలని అలా అనలేదు. నా ఎమోషనల్‌ బాండింగ్‌ని చెప్పడానికి అలా అన్నానంతే.

* దర్శకుడు అర్జున జంధ్యాల వర్క్ ఎలావుంది?
– సూపర్ . అతని వేవ్‌లెంగ్త్‌, నా వేవ్‌లెంగ్త్‌ కలిశాను. ఒక సందర్భానికి అతనెలా రియాక్ట్‌ అవుతాడో, నేనూ అంతే రియాక్ట్‌ అవుతాను. మన వేవ్‌లెంగ్త్‌కి కనెక్ట్‌ అయిన వాళ్లతో పనిచేస్తున్నప్పుడు ఓ మజా వస్తుంది. ఈ సినిమాలో నాకు అది అనిపించింది. పైగా అతనిలో జెన్యూనిటీ బాగా నచ్చింది. సినిమాలో ఏదో కమర్షియల్‌ వేల్యూస్‌ జోడించాలని ‘కొట్టేయాలి.. స్టార్‌ హీరో కావాలి.. ఏలేయాలి’ అని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మంచిగా నటించాలి. 100 శాతం జెన్యూనగా చేయాలి అనే అనుకుంటా. అదే జెన్యూనిటీ అతనిలోనూ చూశాను.

* మూడు చిత్రాలు చేశారు కదా.. ఏం నేర్చుకున్నారు?
– నా ప్రతి చిత్రంతోనూ నేను ఎదగాలని భావిస్తాను. నా ఆఖరి కోరిక మాత్రం చిరంజీవిగారి స్థాయిని చేరుకోవడమే. స్కై ఈజ్‌ ద లిమిట్‌ అని అనుకుంటే, నా దృష్టిలో ఆ స్కై చిరంజీవిగారే.

* గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటిస్తున్నట్లున్నారు ?
– అవునండీ .. వచ్చిన కొత్తల్లో కాబట్టే చేయగలుగుతున్నానేమో. అలా కాకుండా ఓ ఇమేజ్‌ వచ్చేసిన తర్వాత అయితే చేసేవాడినో, కాదో! పైగా ‘గ్యాంగ్‌లీడర్‌’లో నేను చేస్తున్నది రొటీన విలన కాదు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘బాహుబలి’లో రానా కూడా విలనగా నటించారు. అలాగని ఆయనేం విలనగా కంటిన్యూ కావడం లేదు కదా. అయినా నేను ‘గ్యాంగ్‌లీడర్‌’ అంగీకరించడం వల్ల నా స్పాన పెరుగుతుందని భావిస్తున్నా. ఆ సినిమాలో పెద్ద హీరో, పెద్ద దర్శకుడు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఓపెనింగ్స్‌ బాగా వస్తాయి. లోపలికి వచ్చినవాళ్లు తప్పకుండా నా గురించి మాట్లాడుకుంటారు. నా కెరీర్‌లో ఇలాంటి అవకాశం, ఇలాంటి పాత్ర మళ్లీ వస్తుందో రాదోగానీ, నాకు మాత్రం మంచి ఎక్స్‌పీరియన్సని ఇచ్చింది.

* మీరు కొత్తవారితోనే చేయడానికి కారణం?
– కొత్త వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటాను. నా మనసులోని మాటలను యథేచ్ఛగా చెప్పేస్తుంటా. కానీ ఎక్స్‌పీరియన్స్డ వాళ్లతోనూ ఈ విషయాలను చెబుతాను. కానీ దానికంటూ స్పెషల్‌గా చెబుతా. పైగా నేను ఏదైనా సన్నివేశంలో బాగా చేసినప్పుడు వాళ్లు మెచ్చుకుంటే, ఆ హై నాలో ఇంకో విధంగా ఉంటుంది.
* హీరోయిన్ అనగా గురించి?
– ఈ సినిమాకు అనఘ వంద శాతం యాప్ట్‌. ఇమేజ్‌, గొప్ప గ్లామర్‌ ఉన్న హీరోయిన్లు ఈ సినిమాకు పనికిరారు. ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్‌ యాప్ట్‌. సెకండ్‌ హాఫ్‌లో ఆమె నటనతో ఇరగదీసేసింది.

* మీరు ఎలాంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారు ?
– ఇమేజ్ అనే చట్రంలో ఉండను. అది తప్పకుండా కేరీర్ పై ప్రభావం ఉంటుంది. కానీ నా స్థాయిలో కాదు. నా పై స్థాయి ఉన్న హీరోలకు మాత్రం అది వర్తిస్తుంది. రవితేజలాంటి హీరోలు ఆర్ట్‌ సినిమా చేస్తే నేనైతే చూడలేను. మరి అలాంటి ఇమేజ్‌ నాకు వచ్చిందని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలు నన్ను ఇంకా నన్నుగా అంగీకరిస్తున్నారో లేదో తెలియదు. ‘ఆర్‌.ఎక్స్‌.100’ హీరోగానే నన్ను గుర్తుపడుతున్నారు. సెల్ఫీలు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఆ సినిమాకు చాలా పేరు వచ్చింది. అంత పేరు వస్తుందని ముందు నేను ప్రిపేర్‌ కాలేదు. తీరా వచ్చాక నాకు భయమేసింది. దాంతోనే నేను ‘హిప్పి’ చేశా. ఇప్పుడు అందులోనుంచి మెల్లిగా బయటకు వస్తున్నా. అందువల్ల ఆర్‌.ఎక్స్‌.100కి ఇమేజ్‌ వచ్చింది కానీ, ఆ సినిమా హీరోగా నాకు కాదు.

* మీ సినిమా ఇతర భాషల్లోకి రీమేక్ అవడం ఎలా వుంది?
– చాలా గర్వంగా ఉంటుంది. నా సినిమా అనే ఫీల్‌ ఉంటుంది. ఎవరైనా నా దగ్గరకు రీమేక్‌ కథలు తీసుకొచ్చినా, వెంటనే ఇది గుర్తుకొస్తుంది.

* 90ఎంఎల్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
– ఆ పేరు ఇంకా బయటకు చెప్పడం లేదు. అక్టోబర్‌లో రిలీజ్‌ ఉంటుంది. దాంతో నాలుగు రిలీజ్‌లున్నట్టు లెక్క. ఆ చిత్రంతో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. సగం పూర్తయింది. మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.

* కథల విషయంలో మీ జోక్యం ఎంత ?
– నేనే వింటా. హిట్టయినా, ఫ్లాప్‌ అయినా క్రెడిట్‌ నాదేనంటా. ఒకవేళ వేరే జోనర్‌ వింటున్నప్పుడు మాత్రం దానికి తగ్గ వయసులో ఉన్నవారికి వినిపిస్తా. ఉదాహరణకు ‘గుణ369’ కాస్త ఫ్యామిలీలకు సరిపోయే చిత్రం. అందుకే మా నాన్నను, బాబాయ్‌ను కూర్చోపెట్టి వినిపించా. వాళ్లకు పిచ్చగా నచ్చింది. నాకు హ్యాపీ.

* మీకు ఎడ్యుకేషన్స్ ఇన్స్ట్యూట్ వున్నాయి కదా .. ?
– అవును.. అవన్నీ మా ఫాదర్, బాబాయిలు చూసుకుంటారు. బిగ్ బ్యానర్స్ నుండి పెద్దగా ఆవకాశాలు రాలేదన్నదే నిజం. చూద్దాం అయినా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కదా. నాకు నచ్చిన నటన చేసుకుంటూ ఇదే రంగంలో కొనసాగుతా.

* తర్వాత ప్రాజెక్టులేంటి?
– వినాయక్‌గారి అసిస్టెంట్‌ శ్రీ అనే అబ్బాయి దగ్గర ఓ స్ర్కిప్ట్‌ విన్నా. తను ఆ పనుల్లో ఉన్నాడు. త్వరలో ఆ సినిమా వివరాలు చెప్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.. యంగ్ హీరో కార్తికేయ..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All