Homeటాప్ స్టోరీస్రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన నటుడు

రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన నటుడు

Actor devaraj met accidentరోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు దేవరాజ్ గాయాలపాలయ్యాడు . ఈ సంఘటన ఈరోజు కర్ణాటకలో జరిగింది . తెలుగు లో పలు చిత్రాల్లో విలన్ గా నటించాడు దేవరాజ్ . తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దేవరాజ్ కన్నడ నటుడు . కన్నడంలో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా నటించాడు . ఇక సంఘటన విషయానికి వస్తే ……. కుటుంబంతో కలిసి షూటింగ్ కి వెళ్లిన దేవరాజ్ తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు యాక్సిడెంట్ కు గురయ్యింది . కారు ఒక్కసారిగా కుదుపులకు లోను కావడంతో దేవరాజ్ కు స్వల్ప గాయాలయ్యాయి .

ఇక ఇదే యాక్సిడెంట్ లో దర్శన్ అనే హీరో చేయి విరిగినట్లు తెలుస్తోంది . అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కారు డ్రైవ్ చేస్తున్నారు ? మద్యం సేవించారా ? లేక ఏదైనా తగాదా జరిగిందా ? ఇత్యాది విషయాలన్నీ తెలియాల్సి ఉంది . దేవరాజ్ , దర్శన్ లతో పాటు మిగతావాళ్లకు గాయాలు కావడంతో వెంటనే మైసూర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు దేవరాజ్ , దర్శన్ లు . ఇటీవలే దేవరాజ్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: Actor devaraj met accident

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All