
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా ట్రైలర్ రావడమే కాదు యూట్యూబ్ లో విడుదలైన అతి తక్కువ టైంలోనే 6 మిలియన్ వ్యూస్ రాబట్టి దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ తాలూకా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేశారు. థియేటర్లలో ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఆ తర్వాత ట్రయిలర్ ను సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత చిత్రసీమ నుండి పలువురు ప్రముఖులు ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబు ఇస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే..
రామ్ చరణ్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. `దివ్య వనమొకవైపు… తీర్థ జలం ఒక వైపు… నడుమ ఆదఘట్టం.. అంటూ టెంపుల్ సిటీ ధర్మ స్థలిలోని చూపించారు. ఇక్కడ అందరూ సౌమ్యులు పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలొచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని వుంటామేమో నని పొరబడి వుండొచ్చు…ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది. ధర్మ స్థలి..అధర్మస్థలి ఎలా అవుతది? అంటూ చరణ్ చెబుతున్న డైలాగ్ సినిమా ఫై అంచనాలు పెంచేలా చేసింది. మెగాస్టార్ ఎంట్రీ… పాదఘట్టం వాళ్ల గుండెలమీద కాలేస్తే ఆ కాలు తీసెయ్యాలట. కాకపోతే అది ఏకాలా అని… నేను వచ్చానని చెప్పాలనుకున్నాను… కానీ చేయటం మొదలుపెడితే… అంటూ చిరంజీవి తనదైన స్టయిల్ లో డైలాగ్ చెప్పాడు. చివరిలో చిరంజీవి , చరణ్ లు కామ్రేడ్ డ్రెస్ లో కనిపించి అదరగొట్టారు. ఓవరాల్ గా ట్రైలర్ మొత్తం కూడా యాక్షన్ తో కుమ్మేసింది. నిన్నటి వరకు ఆచార్య అనగానే క్లాస్ మూవీ అనుకున్నారు కానీ ట్రైలర్ చూస్తే ఊర మాస్ గా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.