
మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ తాలూకా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా లో విడుదల చేసారు. కాగా ఈ ట్రైలర్ టాలీవుడ్ లో ఒక రికార్డు సెట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై 24గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. తెలుగు చిత్రసీమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా ఈ సినిమా ట్రైలర్ నిలిచినట్లు అధికారిక ప్రకటన చేసారు. ఫ్యాన్స్ అయితే విపరీతంగా లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ను మరింత ట్రెండ్ చేస్తున్నారు. మెగా అభిమానులంతా ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఉండడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.