
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ తరుణంలో గత వారం రోజులుగా చిత్ర ప్రమోషన్ లలో కొరటాల శివ , చిరంజీవి , రామ్ చరణ్ బిజీ బిజీ గా గడిపారు. వాటిలో హరీష్ శంకర్ కూడా వీరితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసి సినిమా తాలూకా విశేషాలను రాబట్టారు. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి “ఆచార్య” సినిమాను ఎప్పుడు చూపించబోతున్నారని హరీశ్ శంకర్ చిరంజీవిని అడగగా త్వరలోనే… దాని కోసం ప్రత్యేకంగా థియేటర్‌ను బుక్ చేశామని, అందరం కలిసి సినిమా చూస్తామని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అయితే ఏ థియేటర్.. ? స్పెషల్ షో ఎప్పుడు.. ఎక్కడ ? అన్న విషయాన్ని రివీల్ చేయలేదు.