
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హాజరు కాబోతున్నట్లు సమాచారం.
ముందుగా ఈ వేడుకను విజయవాడ లో జరపాలని , ముఖ్య అతిధిగా సీఎం జగన్ ను ఆహ్వానించబోతారనే వార్తలు వినిపించాయి. కానీ సడెన్ గా వేదిక ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ లో సిద్ద అనే పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.