
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పట్నించో ఊరిస్తున్న వస్తున్న సినిమా కావడం తో అంతటా ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల నడుము రిలీజ్ అయినా ఈ మూవీ యావరేజ్ టాక్ దక్కించుకుంది. కొరటాల కథలో దమ్ము లేకపోవడం , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేకపోవడం, మ్యూజిక్ పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విసురుతున్నారు. అయినప్పటికీ ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టింది.
నైజాం ఏరియా లో రూ.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. వైజాగ్ లో ఫస్ట్ డే 3.6 కోట్ల షేర్ ని రాబట్టగా కృష్ణా లో 1.9 కోట్ల షేర్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. మిగతా ఏరియాలకు సంబదించిన కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాకు డివైడ్ టాక్ రావడం తో ఆ ప్రభావం కలెక్షన్ల ఫై గట్టిగానే పడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.