Homeటాప్ స్టోరీస్ఆచార్య సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే

ఆచార్య సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే

acharya censor report
acharya censor report

ఆచార్య మూవీ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తీ చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసారు. అలాగే సినిమా రన్ టైం 154 నిమిషాలు (2 గంటల 34 నిమిషాలు) వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా చాల బాగా వచ్చిందని , చిరంజీవి – చరణ్ లను ఒకే ఫ్రెమ్ లో చూడడం అభిమానులకు కన్నుల పండగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్పినట్లు సమాచారం.

ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో జరగబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శక ధీరుడు రాజమౌళి ఈ భారీ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారని వినికిడి. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ భారీ మూవీని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారికగా ఓ దశలో చరణ్ తో కలిసి నక్సలైట్ గా నూ కనిపించబోతున్నారు. ధర్మస్థలి కోసం వీరు ఏం చేశారు? .. చరణ్ కిచ్చినన మాట కోసం ఆచార్యుడు ఏం చేశాడు? ధర్మస్థలికి అండగా ఎలా నిలిచాడనే కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All