
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీ బిజీ గా ఉన్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరుగగా..ఈరోజు హైదరాబాద్ లో మీడియాతోనూ ‘ఆచార్య’ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, పూజా హెగ్డే..మీడియాతో ముచ్చటించారు. అలాగే సినిమా నుండి మరో ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27న లేదా 28న మరో సాలిడ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని టాక్.
- Advertisement -