
చిత్రసీమలో వరుస విషాదాలు సినీ ప్రముఖులను , అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్యం తో మరణిస్తుంటే..మరికొంతమంది హార్ట్ ఎట్టాక్ , రోడ్డు ప్రమాదాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ బెంగాలి నుటుడు అభిషేక్ ఛటర్జీ(58) కన్నుముశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో ఈరోజు గురువారం( మార్చ్ ౨౪) ఉదయం కన్నుమూసారు.
బెంగాలిలో 100కి పైగా సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. చాలా డిమాండ్ ఉన్న కారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన. అభిషేక్ మృతితో బెంగాలి చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1986లో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. దాదాపు 120 సినిమాలకు పైగానే నటించారు. కొన్ని బంగ్లాదేశీ సినిమాలు కూడా చేసారు. ముఖ్యంగా ఓరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి సినిమాల్లో అభిషేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. టీవీలో కూడా తనదైన ముద్ర వేసాడు అభిషేక్ ఛటర్జీ. ఎన్నో వందల సినిమాల్లో అలరించిన నటుడు కళ్ల ముందు లేడనే విషయాన్ని తెలుసుకుని బాధ పడుతున్నారు అభిమానులు. ఈయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు.