Homeటాప్ స్టోరీస్సహజనటికి "అభినయ మయూరి"అవార్డు

సహజనటికి “అభినయ మయూరి”అవార్డు

abhinaya mayuri award winnar jayasudha కళాబంధు, సాంస్కృతికనేత, టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీ,నటులకు అవార్డులు ఇచ్చి బిరుదులతో సత్కరించటం గత 20ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరంకూడా అలాగే ఇవ్వనున్నారు. ‘అభినయ మయూరి’ అనే ఆవార్డును సహజనటి జయసుధకు ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు.

కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ: “ఇరవై ఏళ్ల నుంచీ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లకు అవార్డులు ఇస్తూ వస్తున్నా. ఇప్పుడు జయసుధకు ‘అభినయ మయూరి’ అనే అవార్డును ఇవ్వబోతున్నా.

- Advertisement -

ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఎన్నో శాఖల్ని ఇముడ్చుకున్న సినిమా దేవుని సృష్టిలో చాలా గొప్ప కళ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవాళ్లు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు” అన్నారు.

సీనియర్ నటుడు మురళీమొహన్ మాట్లాడుతూ: “జయసుధ అదివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ‘జ్యోతి’ సినిమా మరో ఎత్తు. ఆ సినిమాతో ఆమె నటిగా విపరీతమైన పేరు తెచ్చుకుంది. ఇద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. తను స్నేహానికి చాలా విలువిచ్చే నటి. సుబ్బరామిరెడ్డిగారు ఆమెకు ‘అభినయ మయూరి’ అనే అవార్డుతో సత్కరించనుండటం ఆనందంగా ఉంది.

ఏదో ఒకరోజు నాకు కూడా ఆయన ఏదో ఒక అవార్డును ఇస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డుల్ని పట్టించుకోవట్లేదు. నంది అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటారు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఆ అవార్డుల్ని ఇవ్వాల్ని కోరుతున్నా. నాలుగేళ్ల నుంచీ ఆ అవార్డులు పెండింగులో ఉన్నాయి” అని చెప్పారు.

ఒకప్పటి అందాల నటి జమున మాట్లాడుతూ:జయసుధ ‘పండంటి కాపురం’లో నా కూతురిగా నటించింది. చాలా చక్కని నటి. ఆమెకు సుబ్బరామిరెడ్డిగారు అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆమె మాతో సమానమైన మహానటి అని చెప్పొచ్చు. గొప్ప గొప్ప పాత్రలు చేసింది. కళల పట్ల, సినీ రంగం పట్ల సుబ్బరామిరెడ్డి గారికున్న అభిమానం చాలా గొప్పది. విశాఖపట్నంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అపూర్వం” అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All