Homeటాప్ స్టోరీస్అభిమన్యుడు రివ్యూ

అభిమన్యుడు రివ్యూ

Abhimanyudu-Reviewఅభిమన్యుడు రివ్యూ
నటీనటులు : విశాల్ , సమంత , అర్జున్
సంగీతం : యువన్ శంకర్ రాజా
నిర్మాత : విశాల్
దర్శకత్వం : పీఎస్ మిత్రన్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 1 జూన్ 2018తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన తమిళ చిత్రం ” ఇరుంబు తిరై ” . గతనెలలో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ”అభిమన్యుడు” గా విడుదల చేసారు . డిజిటల్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించినట్లు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

ఆవేశపరుడైన మేజర్ కరుణ ( విశాల్ ) తన కుటుంబ అవసరాల కోసం లోన్ తీసుకుంటాడు . అయితే లోన్ కోసం ఫేక్ డాక్యుమెంట్స్ పెడతాడు , కానీ తీసుకున్న లోన్ వెంటనే అతడి ఖాతాలోంచి మాయం అవుతుంది . దాంతో షాక్ తిన్న కరుణ తన డబ్బు మాయం కావడానికి గల కారణాలను వెతికే పనిలో షాకింగ్ కి గురయ్యే వాస్తవాలు తెలుస్తాయి . కరుణ ఎకౌంట్ నుండి డబ్బులు దొంగిలించిన వాళ్ళు ఎవరు ? కరుణ తెలుసుకున్న నిజాలు ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

- Advertisement -

హైలెట్స్ :

విశాల్
అర్జున్
రీ రికార్డింగ్
ఛాయాగ్రహణం

డ్రా బ్యాక్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

ఆర్మీ మేజర్ గా విశాల్ నటన చాలా బాగుంది పైగా అతడిలో ఇంతకుముందు కంటే మెరుగైన నటన ప్రదర్శించడానికి ట్రై చేసాడు . యాక్షన్ దృశ్యాల్లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా మెప్పించాడు . వైట్ డెవిల్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటన అద్భుతమనే చెప్పాలి . వైట్ డెవిల్ పాత్రలో అర్జున్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేమంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్రని అర్జున్ పోషించిన విధానాన్ని . విశాల్ – అర్జున్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బలంగా ఉన్నాయి . ఇక సమంత విషయానికి వస్తే …… నటనకు పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ ఆడి పాడి అలరించింది .

సాంకేతిక వర్గం :

సైబర్ క్రైమ్ నేపథ్యంలో దర్శకుడు మిత్రన్ రెడీ చేసుకున్న ఈ కథ యూత్ ని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు . దర్శకుడు మిత్రన్ కు జరిగిన అనుభవాల నేపథ్యంలో డిజిటల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా పరిశోధించి చేసిన చిత్రం ఈ అభిమన్యుడు . డిజిటల్ లైఫ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసిన విధానం ఆకట్టుకుంటుంది . విశాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి . యువన్ శంకర్ రాజా అందించిన సంగీతంలో పాటల కంటే నేపథ్య సంగీతానిదే అగ్ర తాంబూలం . ఈ సినిమా మూడ్ కి తగ్గట్లుగా రీ రికార్డింగ్ ఇచ్చాడు యువన్ . జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా :

డిజిటల్ ఇండియాని సవాల్ చేసే అభిమన్యుడు

         Click here for English Review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All