Homeటాప్ స్టోరీస్చిన్న చిత్రాల విడుదలకు ఆప్ రూపకల్పన: ప్రతాని రామకృష్ణ గౌడ్

చిన్న చిత్రాల విడుదలకు ఆప్ రూపకల్పన: ప్రతాని రామకృష్ణ గౌడ్

aapp designed for the release of small films pratani ramakrishna goudతెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సినివారంలో 10.08.2018న ప్రతాని రామకృష్ణ గౌడ్ (నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్) గారితో టాక్ ఎట్ సినివారం కార్యక్రమం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది.

ముందుగా తెలంగాణ ప్రాంత సినీ ప్రముఖులు, నటులు, నిర్మాత పైడి జైరాజ్ వర్ధంతి సందర్భంగా జరిగిన నివాళి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ గారు, సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మరియు నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు పాల్గొని పైడి జైరాజ్ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులు అర్పించారు.

- Advertisement -

ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తన సినీరంగ ప్రస్థానాన్ని సినీప్రేమికులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2001కి ముందు తెలుగు సినిమారంగంలో చిన్న సినిమాల విడుదలకు చాలా ఇబ్బందులు ఉండేవని, డిజిటల్ ఫార్మాట్ వచ్చాక కొంత లాభం చేకూరిందన్నారు. అయితే, డిజిటల్ విధానంలో కూడా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని దానివల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని, రిలీజ్ చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. చిన్న సినిమాలు ఎక్కువగా విడుదలవుడంవల్ల ఎక్కువమంది కళాకారులు ముందుకు వస్తారని తెలుపుతూ చిన్న సినిమాల విడుదలకోసం ఒక ఆప్ ని కూడా రూపొందిస్తున్నామన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ద్వారా 1. సినిమారంగ టెక్నిషన్స్ కి హెల్త్ కార్డులు, ఇళ్ళు ఇప్పించడం; 2. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి 15 లక్షల సబ్సిడీ ఇవ్వడం; 3. 50 ఎకరాల్లో ఫిలిం ఇన్సిట్యూట్ ఏర్పాటుచేయడం; 4. బస్టాండ్స్ లో చిన్న థియేటర్స్ ఏర్పాటుచేయడం; 5. రోజులో ఒక షోకి డిజిటల్ ఖర్చుల మినహాయింపు ఇవ్వడం, 6. చిన్న సినిమాల విడుదలకి సహకారం అందించడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ… మారుతున్న టెక్నాలజీకాలంలో సినిమాల విడుదలకు థియేటర్స్ అవసరంలేదని హోమ్ థియేటరే గొప్ప విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్ వంటి సంస్థలు కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నాయని చెపుతూ ఇంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతాలు చేసి కలల్ని నిజం చేసుకొని కొత్త తరం దర్శకుల్లో ఒకరిగా అవ్వాలని యంగ్ ఫిలిం మేకర్స్ కి సూచించారు.

అనంతరం, జరిగిన ముఖాముఖి చర్చలో తెలంగాణ సినిమారంగ అభివృద్ధిలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ యొక్క తోడ్పాటు గురించి యంగ్ ఫిలిం మేకర్స్ అడిగిన ప్రశ్నలకు రామకృష్ణ గౌడ్ గారు సమాధానాలు అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All