
ఆమనీ..తెలుగులో ఎన్నో ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను మెప్పించిన నటి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. కాగా తాజాగా ఈమె మేనకోడలు హృతిక కూడా చిత్ర సీమా లోకి అడుగుపెట్టబోతుంది.
అభిలాష్ భండారి హీరోగా తెరకెక్కుతున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో కథానాయికగా హృతిక నటిస్తోంది. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై వెంకటరత్నం ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీ లవ్ , సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు
డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మరి ఈ మూవీ లో హృతిక ఎలా నటించిందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
- Advertisement -