Homeటాప్ స్టోరీస్`బ్లాక్‌`తో యంగ్ హీరో మ‌ళ్లీ ట్రాక్‌లోకి?

`బ్లాక్‌`తో యంగ్ హీరో మ‌ళ్లీ ట్రాక్‌లోకి?

`బ్లాక్‌`తో యంగ్ హీరో మ‌ళ్లీ ట్రాక్‌లోకి?
`బ్లాక్‌`తో యంగ్ హీరో మ‌ళ్లీ ట్రాక్‌లోకి?

డైలాగ్  కింగ్ సాయికుమార్ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆది సాయికుమార్. ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఆయ‌నకు హిట్ అనే మాట అంద‌ని ద్రాక్ష‌గా మారింది. సోలో హీరోగా, మ‌ల్టీ స్టార్ చిత్రాల్లో న‌టించినా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌డం లేదు.

దీంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావ‌డానికి `బ్లాక్‌`తో రాబోతున్నాడు.  ప్ర‌స్తుతం మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అందులో ఓ చిత్రానికి `బ్లాక్‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది. `ఆట‌గాళ్లు` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌నా బానిక్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. జి.బి. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హంకాళి మూవీస్ బ్యానర్‌పై మ‌హంకాళి దివాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు వ‌ర్కింగ్ స్టిల్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

- Advertisement -

లాక్‌డౌన్ బిఫోర్ చిత్రీక‌ర‌ణ 70 శాతం పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. లాక్‌డౌన్ త‌రువాత బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.  నిర్మాత మాట్లాడుతూ `ఈ చిత్రానికి `బ్లాక్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశాం. స‌క్సెస్ కోసం క‌సిగా ఎదురుచూస్తున్న ఆది ఈ ఇత్రం కోసం చాలా శ్ర‌మిస్తున్నారు. ఆది కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలు రాయిలా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌క‌ముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All