
రష్మిక..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ..ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. తాజాగా ఈమె శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ లో నటించింది. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ, ఊర్వశీ, ఝూన్సీ, వెన్నెల కిశోర్, రవి శంకర్, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసారు. ఈ వీడియో లో రష్మిక సెట్ లో ఎంత అల్లరి చేసిందో చూపించారు. ఈ వీడియో చూస్తే రష్మిక మాములు అల్లరిపిల్ల కాదు అని అనకుండా ఉండలేరు. మీరు కూడా ఈ అల్లరి పిల్ల వీడియో చూడండి.
