Homeటాప్ స్టోరీస్`A1 ఎక్స్‌ప్రెస్` మూవీ  రివ్యూ

`A1 ఎక్స్‌ప్రెస్` మూవీ  రివ్యూ

A1 Express Movie Telugu Review
A1 Express Movie Telugu Review

న‌టీన‌టులు : స‌ందీప్ కిష‌న్, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ఱ‌ముళి,  రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం :  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు:  టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, దాయా ప‌న్నెం.
ఛాయాగ్ర‌హ‌ణం :  కెవిన్ రాజ్‌ ‌
సంగీతం:  హిప్ హాప్ త‌మిళ‌‌
ఎడిటింగ్ :  చోటా కె. ప్ర‌సాద్
రిలీజ్ డేట్ : 05- 03- 2021
రేటింగ్‌: 2.75/5

హీకీ క్రీడ నేప‌థ్యంలో తెలుగులో ఇంత వ‌ర‌కు ఏ సినిమా రాలేదు. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ న‌టించిన `చెక్ దే ఇండియా` హాకీ నేప‌థ్యంలో రూపొందిందే. ఆ త‌రువాత తెలుగులో హాకీ క్రీడా నేప‌థ్యంలో రూపొందిన తొలి చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. క్రీడ‌ల్లో కార్పొరేట్ శ‌క్తుల ఎంట్రీ.. రాజ‌కీయాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకుందా?. సందీప్ కిష‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీ స‌క్సెస్‌ని సాధించిందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
యానాంలో వున్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్ కు ఓ చ‌రిత్ర వుంది. అలాంటి గ్రౌండ్‌ని కాజేయాల‌ని ఓ విదేశీ కంప‌నీ క‌న్నేస్తుంది. దానికి లోక‌ల్ లీడ‌ర్‌, క్రీడాశాఖ మంత్రి రావు ర‌మేష్ అండ‌గా నిలిచి పావులు క‌దుపుతుంటాడు. ఇదే గ్రౌండ్‌కి త‌ను ప్రేమించిన అమ్మాయి లావ‌ణ్య (లావ‌ణ్య త్రిపాఠి) కోసం సందీప్ నాయుడు అలియాస్ సంజూ (సందీప్‌కిష‌న్) వ‌స్తుంటాడు. ఈ క్ర‌మంలో హాకీ ఆడుతుంటాడు. ఈ నేప‌థ్యంలో సంజూ గురించి తెలిసిన అస‌లు నిజం ఏంటీ?.. ఇంత‌కీ సంజూ ఎవ‌రు? అత‌ని గ‌త‌మేంటీ? .. చిట్టిబాబు గ్రౌండ్‌ని కాపాడే క్ర‌మంలో సంజూ ఏం చేశాడు.. క్రీడాశాఖ మంత్రికి ఎలా ఎదురెళ్లాడు? అన్న‌దే ఇందులె ఆస‌క్తిక‌రం.

న‌టీన‌టుల న‌ట‌న‌:
హాకీ ప్లేయ‌ర్‌గా సంజూ పాత్ర‌లో  సందీప్‌కిష‌న్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను ప్రేమించిన అమ్మాయి కోసం, ఇష్ట‌మైన హాకీ గేమ్ కోసం త‌ప‌న ప‌డే పాత్ర‌లో భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ వున్న యువ‌కుడిగానూ సంజూ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌డానికి హాకీలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. అంతే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీతో స్లిమ్‌గా ఫిట్‌గా వున్న క్రీడాకారుడిగా క‌నిపించ‌డానికి ఎంతో శ్ర‌మించారు. లావ‌ణ్య‌గా లావ‌ణ్య త్రిపాఠి చ‌క్క‌ని అభిన‌యాన్ని క‌న‌బ‌రిచింది. అయితే ప్ర‌ధ‌మాన్థంలో త‌ప్ప ఆమె పాత్ర‌కు పెద్ద‌గా సెకండ్ హాఫ్‌లో స్కోప్ లేదు.

ఈ చిత్రానికి సంబంధించి సందీప్ కిష‌న్ త‌రువాత ఎక్కువ మార్కులు కొట్టేసింది రావు ర‌మేష్‌. లోక‌ల్ లీడ‌ర్‌గా, క్రీడా శాఖ మంత్రిగా ఆయ‌న చెప్పే డైలాగ్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో ముర‌ళీశ‌ర్మ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శిచ అభిజీత్‌, స‌త్య‌, పోసాని త‌మ పాత్ర‌ల ప‌రిధిమేకు న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం:
పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వార్ ఫ్యాక్ట‌రీ, వెంక‌టాద్రి టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సాంకేతికంగా ఫ‌ర‌వాలేద‌నిపించింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సంగీతం, కెమెరా విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌నుకిది తొలి చిత్ర‌మే అయినా ఆక‌ట్టుకునే విధంగా తెర‌కెక్కించాడు.

తీర్పు:
సందీప్ కిష‌న్ 25వ చిత్ర‌మిది. దీనికి ఎంచుకున్న క‌థ‌నం పాత‌దే అయినా తెలుగు తెర‌కు మాత్రం హాకీ నేప‌థ్యం అన్న‌ది కొత్త పాయింట్‌. దీన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. అయితే క‌థ‌నం మ‌రింత ఆక‌ట్టుకునే విధంగా రాసుకుని వుంటే మ‌రింత బాగుండేది. హాకీ నేప‌థ్యం.. అందులో వుండే రాజ‌కీయాలు, త‌ను ఇష్ట‌ప‌డిన ఆట‌.. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువ‌కుడు ప‌డే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ సందీప్ కిష‌న్ వ‌న్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ప్రేక్ష‌కుల‌ని అల‌రించే సినిమా ఇది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All