Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు
ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ “తెలుగు ఫ్యాన్స్ ని అంచనా వేయలేం.” అని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న దర్బార్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. మహేష్ బాబు తో తాను చేసిన స్పైడర్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోవడానికి కారణం; తాను తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాని తియ్యడమే” అని అన్నారు.

స్పైడర్ సినిమా లో ప్రధానంగా తాను మహేష్ బాబును తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా తీశానని అంతే తప్ప తెలుగు ప్రేక్షకులను, అందులోనూ మహేష్ బాబు అభిమానుల అంచనాలు – అభిరుచులను తాను పట్టించుకోలేదని అందువల్లనే ఆ చిత్రం ఘోర పరాజయం పాలైందని; అందుకు తాను ఎంతో బాధపడుతున్నానని మురుగదాస్ విచారం వ్యక్తం చేసారు. ఇది తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మురుగదాస్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాన్ ఇండియా లెవెల్ లో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ, సూపర్ హిట్ లు ఇస్తున్న మురుగదాస్ మహేష్ ఇమేజ్ కి మాత్రం తగిన కథను సెలెక్ట్ చేసి సినిమా గా తీయలేకపోయాడు.. అని తెలుగు ప్రేక్షకుల టేస్ట్ తెలియనప్పుడు ఎందుకు తెలుగులో సినిమా చేశాడని.? సోషల్ మీడియా అడ్మిన్ పేజీల వేదికపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా కూడా సంక్రాంతి ఈ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటంతో ఈ రెండు సినిమాల మధ్య అనుకోని విధంగా పోటీ నెలకొంది. అందువల్లనే కొంత మంది మురుగదాస్ అభిప్రాయాన్ని వక్రీకరించారని కొంతమంది సినిమా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఏదిఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుకు మొదటి నుంచి తమిళ దర్శకుల సెంటిమెంట్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తో ఆయన చేసిన నాని సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత అదే ఎస్.జె.సూర్య “స్పైడర్” సినిమా లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత నేటి వరకు మహేష్ బాబు మళ్లీ తమిళ దర్శకులు జోలికి వెళ్ళలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All