Homeటాప్ స్టోరీస్ఇన్ స్టా లో రౌడీ క్రేజ్ మామూలుగా లేదుగా !

ఇన్ స్టా లో రౌడీ క్రేజ్ మామూలుగా లేదుగా !

ఇన్ స్టా లో రౌడీ క్రేజ్ మామూలుగా లేదుగా !
ఇన్ స్టా లో రౌడీ క్రేజ్ మామూలుగా లేదుగా !

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. వరుస క్రేజీ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. తన క్రేజ్ నే బ్రాండ్ గా మార్చుకుని సంచలనం సృష్టిస్తున్నాడు. అర్జున్ రెడ్డి నుంచి డియర్ కామ్రేడ్ వరకు సెన్సేషనల్ హిట్లని సొంతం చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్  ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ కు సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆనతి కాలం లోనే తన స్టైల్ , ఆటిట్యూడ్ తో. దేశవ్యాప్తంగా ఫాన్స్ ని సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో విజయ్ కున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. తాజాగా సరికొత్త మైలు రాయిని దాటి రికార్డ్ సృష్టించారు. రౌడీ హీరోను ఇన్ స్టా  గ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని సౌత్ ఇండియా లోనే ఈ ఘనతను సాధించిన తొలి హీరోగా నిలిచారు.
80 లక్షల మార్కు దాటటం తో రౌడీ ఫాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ చేసారు. అదీ  కాకుండా తెలుగులో గేమ్ చేంజర్ గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి ‘ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. రీమేక్ చిత్రలో నటించింది షాహీద్ కపూరే అయినా రీమేక్ తో దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో సోషల్ మీడియా లో విజయ్ క్రేజ్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All