
67వ జాతీయ చల చిత్ర అవార్డుల కార్యక్రమం నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చనలచిత్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం నాడు జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరచిన నటీనటులకు.. ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన సిని9మాలకు అవార్డులను అందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందించారు. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈ ఏడాది రజినీకాంత్ కు దక్కింది. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఆయన చేస్తున్న కృషికి ఈ అవార్డ్ అందించడం జరిగింది.
ఇక ఇదే వేడుకలో బెస్ట్ యాక్టర్ గా ధనుష్ అసురన్ సినిమాకు గాను.. భోంస్లే సినిమాకు మనోజ్ బాజ్ పాయి అందుకున్నారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా మళయాళ మూవీ మరక్కర్ నిలిచింది. బెస్ట్ యాక్టర్ గా మణికర్ణిక సినిమా నుండి కంగనా రనౌత్ అవార్డ్ అందుకున్నారు. తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకు కూడా నాలుగు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.