Homeటాప్ స్టోరీస్యువతను ఆకట్టుకుంటున్న '4 లెటర్స్'

యువతను ఆకట్టుకుంటున్న ‘4 లెటర్స్’

4 Letters Movie Running Successfullyవిజయవంతంగా యువతను ఆకట్టుకుంటున్న ‘4 లెటర్స్
– దర్శకుడు ఆర్.రఘురాజ్, నిర్మాతలు దొమ్మరాజు హేమలత,దొమ్మరాజు ఉదయ్ కుమార్

*  శ్రీ మయూరి,మల్లికార్జున, లక్మీకళ  థియేటర్లలో ప్రేక్షకులతో సందడి చేసిన చిత్ర యూనిట్.

- Advertisement -

* సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో చిత్ర విజయాన్ని పంచుకున్న నాయకా,నాయికలు

* యువతను ఆలోచింపచేస్తున్న చిత్రం లోని సందేశం

 

ఈశ్వర్,టుయ చక్రవర్తి, అంకిత మహారాణ లను నాయక,నాయికలుగా పరిచయం చేస్తూ

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో నిర్మాతలు దొమ్మరాజు ఆశాలత,దొమ్మరాజు ఉదయ్ కుమార్ లు నిర్మించిన  “4 లెటర్స్” చిత్రం ఈ నెల 22 న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

 

నేటితరం ప్రేమకధా చిత్రంగా రుపొందిన ఈ ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చిందని,ప్రధానంగా కళాశాల లోని ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా హీరో మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ -పెళ్లి నేపథ్యంలో సాగే చిత్ర పతాక సన్నివేశాలు, కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయని విడుదలైన ప్రధాన థియేటర్లలో ప్రత్యక్షంగా చూసి సంతోషం కలిగిందని చిత్ర నాయిక,నాయికలు, దర్శక నిర్మాతలు తెలిపారు. తమకు విద్య బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు ఆర్ధికంగానూ,హార్దికంగాను అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచింపచేస్తోందని, ఇదే చిత్ర విజయానికి సంకేతమన్నారు.ఇదే సంతోషంలో వీరంతా కలసి ప్రముఖ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని శనివారం సాయంత్రం కలసి చిత్ర విజయాన్ని పంచుకున్నారు.

 

ఈ సందర్భంగా “4 లెటర్స్” చిత్రం గురించి స్టూడెంట్స్ మాట్లాడుతూ..’

ఈ చిత్రంలో హీరో ఈశ్వర్ చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.. “మీ దగ్గర చదివిన వాళ్ళు ఒక బిల్ గేట్స్,ఒక అంబాని,సచిన్,హృతిక్ రోషణ్,ఆటో డ్రైవర్,మెకానిక్ అవొచ్చు..మీరు మాత్రం నెల జీతం తీసుకుంటూ లెక్చరర్ గానే రిటైర్డ్ అవుతున్నారు..ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే మీరు ఏ పొజిషన్ లో ఉన్న మీ లైఫ్ లో  వన్ మంత్ సాలరీని మీకు నచ్చిన లెక్చరర్స్ కి పంపించండి..మనం మంచిగా ఉంటే సరిపోదు ఫ్రెండ్స్ …మనకు చదువు చెప్పిన గురువులు కూడా బాగుండాలి” అని చెప్పిన డైలాగ్ మాకే కాదు ప్రతి స్టూడెంట్స్ కి నచ్చుతుతుంది..

 

మేము ఫ్యూచర్ లో ఏ జాబ్ చేసినా వన్ మంత్ సాలరీని లెక్చరర్స్ కి పంపుతామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాం.అలాగే “4 లెటర్స్” చిత్ర కదా ,కధనం,పాటలు,వినోదం కూడా బాగున్నాయని స్టూడెంట్స్ అన్నారు. ప్రధానంగా యువతకు చిత్రం నచ్చటం పట్ల సంతోషంగా ఉందని, తమ బ్యానరుపై రూపొందించిన తొలి చిత్రం ‘4 లెటర్స్’ విజయ వంతం కావటం మరిన్ని చిత్రాల నిర్మించాలన్న తమ సంకల్పానికి బలం చేకూర్చిందని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All