Homeటాప్ స్టోరీస్జూ. ఎన్టీఆర్ రామాయణానికి 26 ఇయర్స్ పూర్తి

జూ. ఎన్టీఆర్ రామాయణానికి 26 ఇయర్స్ పూర్తి

26 years of bala ramayanam
26 years of bala ramayanam

జూ. ఎన్టీఆర్ రాముడిగా నటించిన రామాయణం చిత్రం నేటికీ 26 ఏళ్లు పూర్తీ చేసుకుంది. ఏప్రిల్ 14, 1996లో వచ్చిన బాల రామాయణం సినిమాతో ఎన్టీఆర్ తొలిసారి వెండితెరపై కనిపించాడు. తాజాగా ఈ సినిమా 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమ సినిమా పాతికేళ్ళు కంప్లీట్ చేసుకోవడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు సోషల్ మీడియాలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమా చేయడానికి దర్శకుడు గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. మొత్తం పిల్లలతోనే ఒక అద్భుతమైన సినిమా చేయాలని భావిస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ కంట పడ్డాడు. అప్పటికే నాట్యంలో శిక్షణ తీసుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను తన సినిమాలో రాముడు వేషం కోసం ఎంపిక చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ సినిమాలో సీతగా నటించిన స్మితా మాధవ్ ఆ ఒక్క సినిమాతోనే నటనకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్ గా ఎన్నో పర్ఫార్మెన్స్ చేసింది. జెమిని, విజయ్ టీవీ లాంటి చానల్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఫారిన్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం విడుదలైన మూడేళ్లకు నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

బాల రామాయణం కథ ఫై నమ్మకంతో నిర్మాత ఎం.ఎస్.రెడ్డి కూడా అత్యంత భారీ తనంతో బాల రామాయణం సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఇప్పటికి చూసినా అదే ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. అప్పట్లో ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All