
94 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ‘డ్యూన్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. సౌండ్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్‌లో డ్యూన్ చిత్రానికి అవార్డులు వచ్చాయి.
ఇక మిగతా విజేతల విషయానికి వస్తే..
ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన డ్రైవ్ మై కార్ నిలిచింది.
ఉత్తమ నటుడిగా విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)
ఉత్తమ డైరెక్టర్‌గా జానే కాంపీయన్(ది పవర్ ఆఫ్ ది డాగ్)
ఉత్తమ సహాయ నటుడిగా ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)
ఉత్తమ సహాయ నటిగా అరియానా డీబ్రోస్(వెస్ట్ సైడ్ స్టోరీ)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో సమ్మర్ ఆఫ్ సోల్‌కు ఆస్కార్ అవార్డు వరించింది.
ఉత్తమ ఏనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘ఎన్‌కాంటో’
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ‘ద లాంగ్ గుడ్‌బై’
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్’
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘క్రూయెల్లా’ చిత్రానికి గానూ జెన్నీ బీవాన్ ఆస్కార్ అందుకున్నారు
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే ‘బెల్‌ఫాస్’ చిత్రానికి గానూ కెన్నెత్ బ్రానాగ్ సొంతం చేసుకున్నారు
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును ‘కోడా’ చిత్రానికి గానూ సియాన్ హెడెర్ కైవసం చేసుకున్నారు.